యోగా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

యోగా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి


యోగా సాధన చేస్తున్న అగ్నిమాపక అధికారులు, సిబ్బంది

బళ్లారి, న్యూస్‌టుడే: సిబ్బంది, అధికారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రాదేశిక అగ్నిమాపకశాఖాధికారి ఆర్‌.మహేశ్‌ సూచించారు. కలబురగి విభాగం, బళ్లారి పతంజలి యోగా సమితి సంయుక్తంగా బళ్లారి తాలూకా మీనళ్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత యోగా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మంగళవారం ప్రారంభమైన ఈ శిబిరం నవంబరు 9 వరకు కొనసాగుతుందన్నారు. యోగా గురువు ఇస్వి పంపాపతి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి యోగా, ఆయుర్వేద వైద్యం. నేడు పని ఒత్తిడి పేరుతో వాటిని పట్టించుకోకపోవడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. యోగా, ప్రాణాయామం, ధ్యానం ప్రాముఖ్యాన్ని వివరించారు. బళ్లారి జిల్లా అగ్నిమాపకశాఖాధికారి తిమ్మారెడ్డి, బళ్లారి తాలూకా అధికారి బసవరాజ్‌, రామప్ప, బసయ్య, యోగా సమితి సభ్యులు హాజరయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని