‘కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలు’
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

‘కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలు’

మంత్రి అశోక్‌కు తమ దుస్థితిని వివరిస్తున్న భూ ప్రకంపనల బాధితులు

కలబురగి, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీ మనుగడ కొనసాగాలంటే ఏదేని ప్రాంతీయ పార్టీలో విలీనమైతే మంచిదని రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ ఎద్దేవా చేశారు. కనీసం అది ఓ ప్రాంతీయ పార్టీగానైనా ఉండగలుగుతుందని వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం కలబురగిలో పర్యటించారు. వరుస భూప్రకంపనలతో తల్లడిల్లుతున్న గడికేశ్వర తదితర గ్రామాల్ని సందర్శించారు. బాధితులతో చర్చించి భయం లేకుండా ఉండాలని, అన్నింటికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికారులతో చర్చించి తగిన సహాయ పనుల్ని చేపట్టనున్నట్లు భరోసా ఇచ్చారు. ఆయన పర్యటనలో రాజకీయాలే ప్రధాన భూమికను పోషించాయి. దేశంలో కాంగ్రెస్‌ నాశనమైందని- రాష్ట్రంలో సిద్ధరామయ్యే ఆ పార్టీని భూస్థాపితం చేశారని ధ్వజమెత్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనే ఆపార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లుగా చెబుతున్న ఆపార్టీ దిగజారుడు రాజకీయాల వల్ల.. ఎన్నికల్లో పట్టుమని 20 సీట్లు కూడా లభించలేదని ఎద్దేవా చేశారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని