నిరాడంబరంగా చాముండి రథోత్సవం
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

నిరాడంబరంగా చాముండి రథోత్సవం


చాముండేశ్వరి అమ్మవారికి మహా రథోత్సవం

మైసూరు, న్యూస్‌టుడే : నాడ దేవత చాముండేశ్వరి రథోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ఆలయంలో ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో రథోత్సవంలో ఇతర భక్తులు పాల్గొనకుండా కట్టడి చేశారు. నగరం నుంచి చాముండి కొండలను చేరుకునే మార్గాన్ని ఉదయం పది గంటల వరకు మూసివేశారు. ప్రముఖులు మాత్రమే ఉత్సవంలో పాల్గొనేందుకు వీలుకల్గింది. కొండపై గ్రామాల ప్రజలను ఉత్సవానికి అనుమతించారు. రాజమాత ప్రమోదాదేవి, మహారాజు యదువీర్‌, మహారాణి త్రిషికాసింగ్‌ ఉత్సవంలో పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం మహారాజు యదువీర్‌ రథాన్ని లాగడం ద్వారా వేడుకలు ప్రారంభించారు. సాధారణంగా ఉత్సవంలో పెద్ద రథాన్ని వినియోగించేవారు. కరోనా కారణంగా ఈసారి చిన్న రథాన్ని మాత్రమే వినియోగించారు. చిన్న రథంపై చాముండేశ్వరి అమ్మవారిని ఊరేగించారు.

నవరాత్రి ఉత్సవాల్లో చాముండేశ్వరిని భక్తులు పెద్ద సంఖ్యలోనే దర్శించుకున్నారు. నవరాత్రుల్లో 74,480 మంది భక్తులు కొండనెక్కి అమ్మోరి ఆశీర్వచనాలు పొందారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి రూ.40.11 లక్షల నగదు కానుకలు అందినట్లు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు.

ఆలయంలో రాజమాత ప్రమోదాదేవి, మహారాజు యదువీర్‌, మహారాణి త్రిషికా సింగ్‌

సంప్రదాయం ప్రకారం ఆలయం ఎదుట ఫిరంగుల మోత


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని