పంచమసాలి.. పాంచజన్యం
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

పంచమసాలి.. పాంచజన్యం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడేే : లింగాయత పంచమసాలి సముదాయాన్ని 2-ఎ రిజర్వేషన్‌ విభాగం పరిధిలో చేర్చేందుకు ఈ నెల 30 లోగా ప్రభుత్వం తీర్మానాన్ని తీసుకోవాలని పంచమసాలి పీఠం మఠాధిపతి జయమృత్యుంజయ డిమాండు చేశారు. ప్రభుత్వానికి ఇస్తున్న చివరి గడువు ఇదేనని హెచ్చరించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తున్నారని చెబుతూ.. ఆయనపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. జస్టిస్‌ సుభాష్‌ బి.ఆడి నేతృత్వంలోని రిజర్వేషన్‌ పునర్‌ పరిష్కరణ నివేదిక అమలు చేస్తారనే భావిస్తున్నామని చెప్పారు. ఈ డిమాండ్‌ వెనుక తమ స్వార్థం ఏమీ లేదన్నారు. పంచమసాలీలు ఆర్థికంగా వెనుకబడిన వారని, ఆదుకునేందుకు ఈ రిజర్వేషన్‌ ఉపయుక్తమని పేర్కొన్నారు. హానగల్‌లో 60 వేల మంది, సిందగిలో 30 వేల మంది పంచమసాలి ఓటర్లు ఉన్నారని, ఈ ఎన్నికల్లో వారి అభిష్టానికి అనుగుణంగా ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని