టీకా ప్రక్రియ వేగవంతం
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

టీకా ప్రక్రియ వేగవంతం


బెంగళూరులో టీకా డోసు లోడ్‌ చేస్తున్న నర్సు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కర్ణాటకలో గురువారం 365 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స అనంతరం 443 మంది ఇళ్లకు తిరిగి వెళ్లారు. చికిత్స పొందుతూ ఎనిమిది మంది మరణించారు. పాజిటివిటీ 0.31 శాతం, మరణాలు 2.19 శాతంగా నమోదయ్యాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 6,705 దేశీయ ప్రయాణికులు, 962 మంది దేశీయ ప్రయాణికులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ల వద్ద 1.17 లక్షల మందికి గురువారం ఆర్‌.టి.పి.సి.ఆర్‌. పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.33 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే బెంగళూరులో టీకా ప్రక్రియకు చక్కని స్పందన లభించింది. సోమవారం ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో టీకా ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకుంది.

టీకాకృతి : చాకృతి (చాక్‌పీస్‌తో కళాకృతి) కళాకారుడుగా ప్రాచుర్యం పొందిన బెంగళూరు సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు సచిన్‌ సాంఘె దేశంలో కరోనా టీకాల వంద కోట్ల డోసులు పూర్తయిన సందర్భంలో ఈ కొత్త చిత్తరువు సిద్ధం చేశారు. ఈ ఘనతను సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, వైద్యులు, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడీ చాకృతి వైరల్‌గా మారింది!- న్యూస్‌టుడే, ఎలక్ట్రానిక్‌సిటీ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని