చూశారా...దీన్ని సాగునీటి కాలువంటారా..!
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

చూశారా...దీన్ని సాగునీటి కాలువంటారా..!


ఆర్‌.హెచ్‌-3 క్యాంపు వద్ద 54వ పిల్లకాలువ దుస్థితి

సింధనూరు, న్యూస్‌టుడే: తుంగభద్ర ఎడమకాలువ పరిధిలో అతిపెద్ద ఉప కాలువ 54. ఇది సింధనూరు తాలూకాలో ఉంది. ఎడమ కాలువ పరిధిలో అత్యధిక ఆయకట్టు ఇక్కడే ఉంది. ఈ ఉప కాలువ పరిధిలోనే లక్ష ఎకరాల సాగుబడి క్షేత్రం ఉంది. ఇంతటి ఘన చరిత్ర గల ఉపకాలువ పరిధిలోని పిల్లకాలువల దుస్థితి వర్ణించలేనిది. ఆర్‌.హెచ్‌-1 నుంచి 5 వరకూ మొత్తం అయిదు కాందిశీకుల క్యాంపులను కలుపుతూ ఇంకా 20 కిలోమీటర్లు వరకూ ముందుకు సాగే ఆర్‌.హెచ్‌ క్యాంపు పిల్లకాలువ ఇలా చెత్తా చెదారం, వృథా మొక్కలు పెరిగిపోయి చుక్కనీరు ముందుకు కదలడం లేదు. ఫలితంగా దిగువ ప్రాంతంలో జొన్న పంట సాగు చేస్తున్న రైతులకు చుక్కనీరు అందడం లేదు. నీటిపారుదల శాఖ సిబ్బంది రెండు, మూడేళ్ల కాలంలో ఒక్కసారైనా పిల్లకాలువను శుభ్రం చేయలేదని ఆర్‌.హెచ్‌-3 క్యాంపు ప్రజలు ఆరోపించారు. కాలువను శుభ్రం చేసుంటే దిగువకు కాస్త నీరు పారేదంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని