పాఠశాలల్లో నిబంధనలు పాటించండి
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

పాఠశాలల్లో నిబంధనలు పాటించండి


తాళూరులో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డీడీపీఐ సి.రామప్ప తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: సుదీర్ఘ విరామం తరువాత తెరిచిన ప్రభుత్వ పాఠశాలల్లో స్థితిగతులను పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి సి.రామప్ప గురువారం పలు గ్రామాలను సందర్శించారు. వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులను ప్రశ్నించారు. నోడల్‌ అధికారులు మైలేశ బైపూర, సత్యనారాయణ, బసవరాజు తదితరులతో కలిసి బళ్లారి తాలూకా కొర్లగుంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో ఆహార పదార్థాలు, కాయగూరల నాణ్యతను పరిశీలించారు. అనంతరం గుడదూరు ప్రభుత్వ పాఠశాల, సిరుగుప్ప తాలూకా తాళూరు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తయారు చేసిన భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. వంట చేసే గదులను పరిశుభ్రంగా ఉంచాలని, అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలని ముఖ్య గురువులకు ఆయన దిశానిర్దేశం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని