నీళ్ల ట్యాంకు ఆవరణలో మొసలి పిల్ల
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

నీళ్ల ట్యాంకు ఆవరణలో మొసలి పిల్ల


మొసలి పిల్లను తీసుకెళుతున్న అటవీశాఖ సిబ్బంది

సిరుగుప్ప, న్యూస్‌టుడే: నగరసభ నీళ్ల ట్యాంకు ఆవరణలో మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. సిబ్బంది బుధవారం శుభ్రం చేస్తుండగా మురుగు కాల్వ పక్కన మొసలి పిల్ల కనిపించడంతో అధికారులకు విషయం చేరవేశారు. వారు అటవీ అధికారి గిరీష్‌కు తెలిపారు. మొసలిని పట్టుకునే వారితో ఆయన వచ్చి తుంగభద్ర నదిలో మొసలి పిల్లను విడిచారు. ఆయన మాట్లాడుతూ నదిలో నీరు నిండుగా ప్రవహించినప్పుడు మొసలి పిల్లలు మురుగు కాల్వలు, నీరు నిల్వ ఉన్న చోటకు చేరుకుని ఉండవచ్చని భావించారు. కొద్ది రోజుల కిందట బస్సు ప్రయాణ ప్రాంగణం వెనుక మురుగు కాల్వలో మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా చిక్కలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని