తొమ్మిదేళ్ల తరువాత విఠల్‌కు విముక్తి
eenadu telugu news
Published : 22/10/2021 01:12 IST

తొమ్మిదేళ్ల తరువాత విఠల్‌కు విముక్తి


విఠల్‌ మలెకుడియ

మంగళూరు, న్యూస్‌టుడే : మావోయిస్టులతో ఎలాంటి సంబంధంలేదని తేలిన నేపథ్యంలో.. విఠల్‌ మలెకుడియకు తొమ్మిదేళ్ల తరువాత విముక్తి లభించింది. మంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన స్నాతకోత్తర విద్యార్థి విఠల్‌ మలెకుడియను 2012లో మావోయిస్టులతో సంబంధం ఉందనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఆయన నివాసంలో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తూ ముద్రించిన కరపత్రాలు, భగత్‌సింగ్‌ పుస్తకం, మావోయిస్టులకు సంబంధించిన వార్తల క్లిప్పింగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోలతో సంబంధం ఉందని వాదించారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగింది.. తనకెలాంటి సంబంధం లేదని విఠల్‌ వాదిస్తూ వచ్చారు. ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించినప్పుడు సీపీఎం నేత ప్రకాశ్‌ కారత్‌, తదితర జాతీయ నాయకులు పరామర్శించారు. అప్పట్లో ఆ అరెస్టు తీవ్ర సంచలనం సృష్టించింది. కేసును విచారించిన మూడో అదనపు జిల్లా న్యాయస్థానం గురువారం మలెకుడియకు అనుకూలంగా తీర్పుచెప్పింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని