కాలువలోకి దూసుకెళ్లిన కారు
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

కాలువలోకి దూసుకెళ్లిన కారు

నలుగురు దుర్మరణం


క్రేన్‌ సాయంతో కారును వెలికి తీస్తున్న సహాయ సిబ్బంది

బాగలకోటె, న్యూస్‌టుడే : వేగంగా వెళ్తున్న సమయంలో అదుపుతప్పి రహదారి పక్కనున్న రాతిని ఢీకొన్న కారు.. అక్కడి కాలువలోకి దూసుకెళ్లిన దుర్ఘటన గురువారం అర్ధరాత్రి బాగల్‌కోటె జిల్లా ముధోళ్‌ తాలూకా లోకాపుర సమీపంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మృతులను బెళగావి జిల్లాకు చెందిన సునిల్‌ నాదప్ప (24), శంకరగౌడ పాటిల్‌ (27), ఎర్రితాతా మౌనేశ్‌ (26), విజయ శివానంద లట్టి (26)గా గుర్తించారు. కారులోనే ఉన్న మరో ఇద్దరు గాయాలతో బయటపడినట్లు తెలిపారు. ముధోళ్‌ వైపు నుంచి సాలహళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. క్రేన్‌ సాయంతో కారును వెలికితీశారు. లోకాపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని