సిందగిలో మద్యం వరద
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

సిందగిలో మద్యం వరద

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడేే : ఉప ఎన్నికల్లో మద్యం వరదలై ప్రవహిస్తోందని రాష్ట్ర అధికారులకు సమాచారం అందింది.. హానగల్‌, సిందగి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ఎక్కువ మంది తమకు మద్యం కావాలని అభ్యర్థులు, వారికి మద్దతుగా వస్తున్న నాయకులను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం పంపిణీ చేసే వారిని గుర్తించేందుకు 99 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 303 స్టాటిక్‌ నిఘా బృందాలను ఏర్పాటు చేశామని ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ రెండు నియోజకవర్గాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.2.07 లక్షల విలువైన 406.6 లీటర్ల మద్యాన్ని స్వాధీనపరుచుకున్నామని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని