నిఖిల్‌- హరీశ్‌ స్నేహగీతి
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

నిఖిల్‌- హరీశ్‌ స్నేహగీతి


చాముండేశ్వరి సన్నిధిలో నిఖిల్‌ కుమారస్వామి, జి.టి. హరీశ్‌ గౌడ తదితరులు

మైసూరు, న్యూస్‌టుడే : జనతాదళ్‌ అగ్రనేతలతో వైరాన్ని పెంచుకుని చివరకు పార్టీనే ఫిరాయిస్తానని మాజీ మంత్రి, చాముండేశ్వరి నియోజకవర్గ శాసనసభ్యుడు జి.టి.దేవేగౌడ ప్రకటించగా.. ఆయన తనయుడు మాత్రం దళపతి నిఖిల్‌ కుమారస్వామితో సాన్నిహిత్యాన్నే ప్రదర్శిస్తున్నారు. మేమిద్దరం అత్యంత ఆత్మీయ మిత్రులమని మరోసారి చాటుకున్నారు. శుక్రవారం నిఖిల్‌కుమారస్వామి చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించగా ఆయనతో పాటు జి.టి.దేవేగౌడ తనయుడు జి.డి.హరీశ్‌గౌడ పాల్గొన్నారు. ఒకరినొకరు తాము అత్యంత ఆప్తులమని ప్రకటించారు. తండ్రుల వైరమెలా ఉన్నా తామిద్దరం అన్యోన్యంగా ఉన్నామని చెప్పారు. వీరిద్దరినీ చూసినవారు ఔరా.. ఇదేమి చోద్యమో! అంటూ ముక్కున వేలేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని