కరోనాపై జన జాగృతి వేగవంతం
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

కరోనాపై జన జాగృతి వేగవంతం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడేే : కర్ణాటకలో కరోనా తీవ్రత ఏమాత్రం కానరాకపోగా.. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా జాగృతి కార్యక్రమాల వేగం పెంచారు. శుక్రవారం 378 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. చికిత్స అనంతరం 464 మంది ఇళ్లకు తిరిగి వెళ్లారు. చికిత్స పొందుతూ 11 మంది మరణించారు. పాజిటివిటీ 0.36, మరణాలు 2.91 శాతంగా నమోదయ్యాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10,828 దేశీయ, 1290 మంది విదేశీ ప్రయాణికులు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.34 లక్షల మంది టీకా వేయించుకున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద 1.03 లక్షల మందికి ఆర్‌.టి.పి.సి.ఆర్‌. పరీక్షలు నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని