రాజ్యోత్సవం వరకు దీపాలంకరణ!
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

రాజ్యోత్సవం వరకు దీపాలంకరణ!

విద్యుద్దీపాలంకరణలో ప్యాలెస్‌, పరిసరాలు

మైసూరు: నగరంలో విద్యుద్దీపాలంకరణను రాజ్యోత్సవం (నవంబరు ఒకటి) వరకు కొనసాగించాలని వివిధ కన్నడ సంఘాల ప్రముఖులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. దసరా ఉత్సవాల సమయంలో ఆరంభమైన విద్యుద్దీపాలంకరణను పర్యాటకులు, వ్యాపారుల ఒత్తిడి కారణంగా 24 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ముందు నిర్ణయించిన ప్రకారం ఏడు నుంచి 15 వరకు అలంకరణ ఉండాలి. ప్రజల ఒత్తిడి కారణంగానే పొడిగించారు. దీన్ని నవంబరు ఒకటి వరకు కొనసాగించాలని కన్నడ సంఘాలు డిమాండు చేశాయి. కర్ణాటక రక్షణ వేదిక ముఖ్యుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే అలంకరణను కొనసాగించవచ్చన్నారు. ఇందువల్ల నగరం మరింతగా పర్యాటకుల్ని ఆకర్షించేందుకు వీలవుతుందని చెప్పారు. రాజ్యోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించనున్న సమావేశంలో ఈ డిమాండ్‌ను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారంలో జిల్లా మంత్రి, ఇతర ప్రముఖ నేతలు నిమగ్నమైనందున వారి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని