రుణమేళాపై 26న అవగాహన
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

రుణమేళాపై 26న అవగాహన


వివరాలు వెల్లడిస్తున్న లీడ్‌ బ్యాంకు డీజీఎం మోహన్‌కుమార్‌

బళ్లారి, న్యూస్‌టుడే: ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా బ్యాంకర్ల సమితి, లీడ్‌ బ్యాంకు(కెనరా) సంయుక్తంగా ఈ నెల 26న స్థానిక కమ్మ కల్యాణ మండపంలో రుణమేళాపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లీడ్‌ బ్యాంక్‌ డీజీఎం మోహన్‌కుమార్‌, ప్రాదేశిక విభాగం మేనేజర్‌ బాలాజీ, జిల్లా మేనేజర్‌ నవీన్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఖాతాదారులకు అందించాల్సిన సేవలపై అవగాహన కల్పించడం, రుణాలు సద్వినియోగం చేసుకోవలసిన మార్గాలు, సామాజిక భద్రత, అటల్‌ పింఛన్‌ పథకాల ప్రయోజనాలను వివరించడం, డిజిటల్‌ పద్ధతి, అంతర్జాలం, సురక్షా బీమా, ప్రధాన మంత్రి ఆవాస్‌ పథకం, స్వ సహాయ బృందాలు, వీధి వ్యాపారులకు రుణాలు, విద్యా రుణాలపై అవగాహన కల్పించడం, సైబర్‌ నేరాల నివారణపై చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని