బస్సు పాసుల కోసం డిమాండ్‌
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

బస్సు పాసుల కోసం డిమాండ్‌


బస్సు ప్రాంగణం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు

బళ్లారి, న్యూస్‌టుడే: విద్యా సంస్థలు ప్రారంభమై రెండు నెలలు గడిచినా బస్సు పాసులు ఇవ్వక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జాప్యం చేయకుండా వెంటనే అందజేయాలని ఏఐడీఎస్‌వో ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కె.ఎస్‌.ఆర్‌.టి.సి. బస్సు ప్రాంగణం వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. అధికారుల తీరుపై ప్రతినిధులు రవికిరణ్‌, ఈరణ్ణ, విద్యార్థులు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. రోజూ పెద్దసంఖ్యలో విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి బళ్లారి వస్తున్నారు. పాసులు లేక ఇబ్బంది పడుతున్నారు. కొందరు బస్సు ఛార్జీలు చెల్లించలేక కళాశాలలకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు చొరవ చూపి పాసులు అందజేయాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని