close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

తాజా వార్తలు

ఇంటర్మీడియట్‌ బాలికపై అత్యాచారయత్నం

సత్తుపల్లి, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ చదివే ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన సొంత మేనబావపై స్థానిక ఠాణాలో శనివారం రాత్రి పోక్సో కేసు నమోదైంది. ఏఎస్సై బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం. సత్తుపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్‌ చదివే బాలికను ఆమె సొంత మేనబావ ఈనెల 14న సత్తుపల్లి బస్టాండులో కలిశాడు. తాను ఇంటికే వెళ్తున్నానని చెప్పి ఆ యువతిని ద్విచక్ర వాహనంపై వేంసూరు మండలంలోని బీరాపల్లి రోడ్డులోని అటవీప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆ యువతిని ఇంటివద్ద దింపేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనను ఆ యువతి తల్లిదండ్రులకు ఆలస్యంగా చెప్పడంతో పెద్దల సమక్షంలో ఆ యువకుడిని నిలదీయగా ఏం చేసుకుంటారో చేసుకోమని సమాధానం ఇవ్వడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలస్వామి తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.