close

సోమవారం, మార్చి 30, 2020

తాజా వార్తలు

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ స్నేహలత

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని, ఇంకా పనులు ప్రారంభించిన అధికారులపై వేటు తప్పదని కలెక్టర్‌ కర్ణన్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో రెండు విడతలుగా జిల్లాలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులు, వాటి పురోగతి, ట్రాక్టర్ల కొనుగోలు, డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం, నర్సరీల నిర్వహణ, ఇంకుడు గుంతల పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 483 గ్రామ పంచాయతీలు నూతన ట్రాక్టర్లు కొనుగోలు చేశాయని, మరో 48 ట్రాక్టర్లకు బ్యాంకు రుణం మంజూరు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తవుతుందని, వెంటనే ట్రాక్టర్లు కొనుగోలు పూర్తి చేయాలన్నారు. మిగిలిన పంచాయతీల్లో ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించి ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బ్యాంకు అధికారులను సంప్రదించి రుణం మంజూరు చేయించాలని చెప్పారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు అనుసంధానంగా ట్యాంకర్లు, ట్రక్కులు బిగించి నీటి సరఫరా, చెత్త సేకరణ ప్రతి రోజు చేపట్టాలన్నారు. నూతన ట్యాంకర్లు, ట్రక్కులు సరఫరాలో జాప్యం నెలకొంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు నిర్మాణం పెండింగ్‌లో ఉన్న గ్రామాల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు రాత్రి బస చేసి స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి పనులు చేపట్టాలన్నారు. నర్సరీల నిర్వహణ, ఇంకుడు గుంతల నిర్మాణ పనుల్లో పురోగతి లోపించితే క్షేత్ర సహాయకులు, ఎంపీవోలను విధుల నుంచి తొలగిస్తామన్నారు. జాప్యానికి కారకులైన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రోజువారీ నివేదికలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు పంపాలని సూచించారు. ట్రాక్టర్‌ ట్రాలీలు, ట్యాంకర్లను నిర్ణీత గడువులోగా సరఫరా చేయాలని ఏజెన్సీల ప్రతినిధులకు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ స్నేహలత, డీపీవో శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో ఇందుమతి, జిల్లా అటవీ అధికారి ప్రవీణ, ఎల్డీఎం చంద్రశేఖర్‌, ఎఫ్‌డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

హాజరైన అధికారులు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.