
గుండెపోటుతో సర్పంచి...
దమ్మపేట, న్యూస్టుడే: దమ్మపేట మండలం శ్రీరాంపురం సర్పంచి పద్దం శివ(30) గుండెపోటుతో శనివారం రాత్రి మృతి చెందారు. శివ మధుమేహంతో బాధపడుతూ 2న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి అదేరోజు అర్ధరాత్రి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా సర్పంచి అయ్యారు. శివకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Tags :