close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జిల్లాలో 47 కరోనా కేసులు
 

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో బుధవారం 47 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు, ల్యాబ్‌లలో చేసిన నిర్ధారణ ద్వారా ఈ ఫలితాలను వైద్యాధికారులు వెల్లడించారు. బాధితుల్లో అత్యధికులు కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు పట్టణాలకు చెందినవారే.

పాల్వంచ పట్టణం: పాల్వంచ సీహెచ్‌సీలో బుధవారం వెల్లడించిన ‘కరోనా’ ఫలితాల్లో ఆరుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొత్తం 25 మందికి పరీక్షలు చేశారు.

కొత్తగూడెం గ్రామీణం: రేగళ్ల పీహెచ్‌సీలో ఆరుగురికి నిర్ధారణ జరిగింది. హేమచంద్రాపురంలో నలుగురు, చాతకొండలో ఒక బాధితుడు ఉన్నారు.

కరోనాతో కేటీపీఎస్‌ ఉద్యోగి మృతి

పాల్వంచ (కేటీపీఎస్‌), న్యూస్‌టుడే: కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లోని ఓ కర్మాగారంలో పనిచేస్తున్న జూనియర్‌ ప్లాంట్‌ అసిస్టెంట్‌ (34) బుధవారం మృతిచెందారు. వారం రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన ‘కొవిడ్‌-19’ చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లో మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: అశ్వారావుపేటలో ఒకరికి కరోనా పాజిటివ్‌ సోకింది. స్థానిక సీహెచ్‌సీలో బుధవారం ఇద్దరికి పరీక్షలు నిర్వహించగా వారిలో పోలీసు విధులు నిర్వహించే ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారించారు.

ములకలపల్లి, న్యూస్‌టుడే: ములకలపల్లి మండలం జగన్నాధపురం పంచాయతీ నల్లివారిగూడెంలో కరోనా కేసు నమోదైనట్లు మంగపేట వైద్యాధికారి డాక్టర్‌ అనిత తెలిపారు.

బూర్గంపాడు, న్యూస్‌టుడే: మండలంలో బుధవారం మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మోరంపల్లి బంజర బ్యాంకు ఉద్యోగి, సారపాకకు చెందిన ఇద్దరు కొవిడ్‌ బారినపడ్డారు.

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బుధవారం 40 మందికి పరీక్షలు చేయగా 5 కొవిడ్‌ కేసులు వచ్చాయి. ఒకరు మణుగూరుకు చెందిన వ్యక్తి కాగా మరో నలుగురు భద్రాచలం వారున్నారు.

పినపాక, న్యూస్‌టుడే: పినపాక పీహెచ్‌సీలో నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి శివకుమార్‌ తెలిపారు. కరకగూడెం పీహెచ్‌సీలో ఓ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి పర్షియానాయక్‌ వెల్లడించారు.

అశ్వాపురం, న్యూస్‌టుడే: అశ్వాపురంలో బుధవారం 5 కరోనా కేసులు నమోదయ్యాయి. తహసీల్దారు పీవీ రామకృష్ణ, వైద్యాధికారి డాక్టర్‌ మణికంఠరెడ్డి ఈ విషయం వెల్లడించారు. సీతారాంపురంలో ఇద్దరు, అశ్వాపురంలో ఒకరు, జగ్గారంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. సీతారాంపురంలో పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు సారపాకకు చెందినవారు.

ఇల్లెందు, ఇల్లెందు గ్రామీణం, టేకులపల్లి, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం 33 మందికి కరోనా పరీక్షలు చేయగా ఐదుగురికి కరోనా సోకింది. వీరిలో పట్టణంలోని 3వ, 7వ వార్డులకు చెందిన వ్యక్తులు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన వ్యక్తి, పోలీస్‌ విభాగానికి చెందిన కానిస్టేబుల్‌, ఓ హోంగార్డు ఉన్నారు.

* కొమరారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు పోలీసులకు పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి వైరస్‌ సోకింది. వారిని ఐసోలేషన్‌కు పంపారు.

* టేకులపల్లిలో బుధవారం ఐదు కరోనా కేసులు నమోదైనట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి వి.నరేశ్‌కుమార్‌ వెల్లడించారు. టేకులపల్లి నుంచి ఇద్దరు, మద్రాస్‌తండా, బద్దుతండా, సులానగర్‌ నుంచి ఒక్కొక్కరు కొవిడ్‌ బారినపడ్డారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.