Updated : 05/05/2021 06:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అభివృద్ధికే పట్టం: తుమ్మల

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం నగరంలో ప్రణాళికాబద్దంగా చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు తెరాసకు పట్టం కట్టారని రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేషన్‌ తొలి పాలకవర్గం ఎన్నికల సమయంలో నగరమంతా పర్యటించిన కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. వేల కోట్ల రూపాయలతో ప్రకాశ్‌నగర్‌ బ్రిడ్జి, నూతన కలెక్టరేట్‌, మాతాశిశుసంరక్షణా కేంద్రం, నూతన బస్టాండ్‌, ధంసలాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, రహదారుల విస్తరణ, గోళ్లపాడు కాలువ ఆధునికీకరణ, రైతుబజార్‌, వెలుగుమట్ల అటవీ ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఖమ్మం నగర ప్రజలు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు మిషన్‌భగీరథ పథకాన్ని అమలు చేశారన్నారు. గత పాలకవర్గం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశారని, అదే విధంగా కొత్త పాలకవర్గం పనిచేయాలన్నారు. నగర అభివృద్ధి విషయంలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అందించిన సహకారం మరువలేనిదన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను తుమ్మల అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని