ఖమ్మం, వరంగల్‌ మేయర్లు ఖరారు
logo
Updated : 07/05/2021 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖమ్మం, వరంగల్‌ మేయర్లు ఖరారు

హైదరాబాద్‌: ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులను తెరాస అధిష్ఠానం ఖరారు చేసింది. మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహ్రాను ఖరారు చేశారు. ఈ మేరకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పేర్లను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు. ఇటీవల జరిగిన ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో 26వ డివిజన్‌ నుంచి పునుకొల్లు నీరజ, 37వ డివిజన్‌ నుంచి ఫాతిమా జోహ్రా విజయం సాధించారు.

ఖమ్మం కార్పొరేషన్‌కు తెరాస ఎన్నికల పరిశీలకుడిగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో తెరాస కార్పొరేటర్లతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి సీల్డ్‌ కవర్‌లో పార్టీ ప్రతిపాదించిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పేర్లను ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి కార్పొరేషన్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుంది.

వరంగల్ కార్పొరేషన్‌..

గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్‌ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. గుండు సుధారాణి వరంగల్‌ 29వ డివిజన్‌ నుంచి గెలుపొందగా.. 36వ డివిజన్‌ నుంచి రిజ్వానా షమీమ్‌ విజయం సాధించారు. వరంగల్‌ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి.. సుధారాణి, షమీమ్‌ పేర్లను ప్రకటించారు. కాసేపట్లో వారు ప్రమాణం చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని