వైకుంఠధామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్‌
logo
Published : 20/06/2021 03:41 IST

వైకుంఠధామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్‌


హమాలీకాలనీ పంచాయతీలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌, న్యూస్‌టుడే: వైకుంఠధామాలకు వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ అనుదీప్‌ సిబ్బందిని ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీకాలనీ, సంజయ్‌నగర్‌, లక్ష్మీదేవిపల్లి పంచాయతీల్లో శనివారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులను పరిశీలించారు. డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల అసంపూర్తి పనులను సత్వరం పూర్తి చేయాలని సూచించారు.

* ప్రభుత్వం పోస్టాఫీసుల్లోని మైక్రో ఏటీఎంల ద్వారా రైతుబంధు పథకం డబ్బులు ఉచితంగా డ్రా చేసుకునే అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అనుదీప్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

* జిల్లాలోని పల్లెప్రకృతి వనాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. శనివారం సుజాతనగర్‌ మండలం సీతంపేటబంజర, సీతంపేట గ్రామపంచాయతీల్లో పలు అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీతంపేటబంజర గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని సర్పంచి మంగమ్మతో అన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని