నేటి నుంచి రామయ్య దర్శన భాగ్యం
logo
Published : 20/06/2021 03:41 IST

నేటి నుంచి రామయ్య దర్శన భాగ్యం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దర్శన భాగ్యం నేటి నుంచి ఉంటుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం 5గం.ల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనాలకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. దేవాదాయ శాఖ నుంచి శనివారం రాత్రి వరకు ప్రత్యేక ఉత్తర్వులు రాకపోవడంతో భక్తుల ప్రవేశాలపై కొంత సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం అన్ని వ్యవస్థలు యథాతథంగా కొనసాగనున్నాయి. అందువల్ల దేవాలయాల దర్శనాలకు ఆటంకం ఉండదని భావిస్తున్నారు. అన్ని రకాల ఆర్జిత పూజలను తిరిగి కొనసాగించనున్నారు.

ఘనంగా ఆపదుద్దారక స్తోత్ర పారాయణం

శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శనివారం సుప్రభాతం పలికి ఆరాధించారు. శ్రీరామ నామాలను పఠించి దేవదేవుడి వైభవాన్ని కీర్తించారు. దర్బారు సేవ భక్తిభావాలను పెంపొందించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని