జిల్లాకు... మరో నర్సరీ
logo
Published : 20/06/2021 03:41 IST

జిల్లాకు... మరో నర్సరీ

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా...

గరిమెళ్లపాడులో ఏర్పాటుకు రంగం సిద్ధం

కొత్తగూడెం సమీపం గరిమెళ్లపాడులోని ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉద్యాన నర్సరీ

కోస్టారికా దేశం నుంచి వచ్చే మొలకలను ఐటీడీఏ ఉద్యాన విభాగానికి ఇచ్చి ప్రత్యేక బ్యాగులో ఏడాదిపాటు ఈ నర్సరీలో మొక్కలుగా పెంచి ఆ తరువాత రైతులకు అందజేయనున్నారు. ఇదీ ప్రారంభం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి నారంవారిగూడెంలోని కేంద్రీయ ఆయిల్‌పాం నర్సరీ కాగా... రెండోది గరిమెళ్లపాడు అవుతుంది. ఈ అంశంపై ఐటీడీఏ ఏపీడీ వలపర్ల ఉదయ్‌కుమార్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఐటీడీఏ ఉద్యాన విభాగం, ఆయిల్‌ఫెడ్‌ సంయుక్తంగా లక్ష మొక్కలతో ఆయిల్‌పాం నర్సరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

అయిదు కేంద్రాల్లో నర్సరీల ఏర్పాటు..

రాష్ట్రంలో ఆయిల్‌పాం నర్సరీల ఏర్పాటుతో ఆ సంస్థ సామర్థ్యం మరింత పెరగనుంది. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌తో పాటు పలు ప్రైవేటు సంస్థలకూ తోటల విస్తరణకు జిల్లాలు కేటాయించారు. ఇందులో ఆయిల్‌ఫెడ్‌ మినహా మరే కంపెనీ నర్సరీల ఏర్పాటును ప్రారంభించనేలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏడాది క్రితం వరకూ అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఒక్కటే ఆయిల్‌పాం కేంద్రీయ నర్సరీ ఉండేది. గత ఏడాది మంచిర్యాలలో రెండు లక్షల మొక్కలతో మరొకటి ఏర్పాటు చేశారు. జిల్లాల్లో ఆయిల్‌పాం తోటల విస్తరణలో ఓ ప్రైవేటు సంస్థకు మంచిర్యాల జిల్లాను కేటాయించడంతో అక్కడున్న నర్సరీని సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్‌కు మార్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బీచుపల్లి, మహబూబాబాదు జిల్లా తొర్రూరు, గజ్వేలు నియోజకవర్గం ములుగులో ఒక్కో నర్సరీని ఏర్పాటు చేశారు. ఇవన్నీ తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయగా తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో గిరిజన సంక్షేమశాఖ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఐటీడీఏ, ఆయిల్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేస్తోంది.


కోస్టారికా నుంచి మొలకలు...

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాకు మరో ఆయిల్‌పాం నర్సరీ సమకూరనుంది. అయితే ఇది తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొలి ఆయిల్‌పాం నర్సరీగా ఏర్పాటు కానుంది. ఇది భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని గరిమెళ్లపాడులో ముస్తాబవనుంది. రాష్ట్రంలో ఆయిల్‌పాం తోటల విస్తరణలో భాగంగా అవసరమైన మొక్కల కోసం అదనపు నర్సరీల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతం ప్రత్యేక చొరవతో 72 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గరిమెళ్లపాడులోని ఐటీడీఏ నర్సరీలో ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల గిరిజన సంక్షేమశాఖ ఏపీడీ ఉదయ్‌కుమార్‌, టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఏరియా అధికారి శివకృష్ణ ఆధ్వర్యంలో కొత్తగూడెం గరిమెళ్లపాడులోని ఐటీడీఏ నర్సరీని పరిశీలించారు. సుమారు లక్ష మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నర్సరీలో పెంచిన మొక్కలను ఉపాధిహామీ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న గిరిజనులకు అందజేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1200 ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కల కోసం గిరిజనులు ఉపాధిహామీ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. నర్సరీ ఏర్పాటుతో వేలాది మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని