రైతుబంధు నగదు చెల్లింపులకు తపాలా శాఖ చర్యలు
logo
Published : 20/06/2021 03:41 IST

రైతుబంధు నగదు చెల్లింపులకు తపాలా శాఖ చర్యలు

ఖమ్మం సారథినగర్‌, న్యూస్‌టుడే: లబ్ధిదారులకు రైతుబంధు నగదు అందించడంలో తపాలాశాఖ చొరవ తీసుకుంది. ఉమ్మడిజిల్లాలోని 610 గ్రామీణ తపాలా కేంద్రాలు, కార్యాలయాల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఖమ్మం డివిజన్‌లో మూడు రోజులుగా రూ.3 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. గురువారం రూ.58 లక్షలు, శుక్రవారం రూ.89 లక్షలు, శనివారం రూ.కోటికిపైగా చెల్లింపులు జరిగాయి. తపాలా బ్యాంకు అందుబాటులోకి తెచ్చిన నూతన విధానంలో లబ్ధిదారుడి ఖాతా ఏ బ్యాంకులో ఉన్నా ఆధార్‌ కార్డు చూపించి తన చరవాణికి వచ్చిన ఓటీపీ ద్వారా సమీపంలోని తపాలా కార్యాలయాలు, పోస్టుమెన్‌ల వద్ద నుంచి రూ.పది వేల లోపు నగదు పొందే సదుపాయం ఉంది. బ్యాంకు ఖాతాలు ఉండి ఆయా బ్యాంకులకు దూరంగా ఉంటున్న గ్రామీణ ప్రాంత రైతులకు తపాలాశాఖ సేవలు ఊరట నిస్తున్నాయి. ఖమ్మం డివిజన్‌ అధికారి రవికుమార్‌ స్వీయ పర్యవేక్షణ కారణంగా సేవల్లో మరింత వేగం పెరిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని