ఆశా వర్కర్ల సేవలు వెల కట్టలేనివి: జిల్లా జడ్జి
logo
Published : 20/06/2021 03:41 IST

ఆశా వర్కర్ల సేవలు వెల కట్టలేనివి: జిల్లా జడ్జి


ఆశాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న జిల్లా జడ్జి భూపతి, కలెక్టర్‌ కర్ణన్‌, డీఎంహెచ్‌వో డా. మాలతి తదితరులు

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: గ్రామీణ భారతానికి ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్ల సేవలు వెల కట్టలేనివని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌కే.భూపతి అన్నారు. శనివారం ఖమ్మం కోర్టు ప్రాంగణంలో న్యాయసేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నర్సింగ్‌ సేవలు-ఇబ్బందులు-చట్ట నివారణ’ అనే సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఆశా వర్కర్లను అభినందించారు. కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ.. గతంలో డెంగీ, ప్రస్తుతం కరోనా వంటి వ్యాధుల కట్టడిలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. రెండో విడత కరోనా కట్టడిలో భాగంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు వైద్యసేవలు అందించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేశారని కొనియాడారు. న్యాయసేవాసంస్థ న్యాయమూర్తి జావీద్‌పాషా, న్యాయవాద సంఘం అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు, సత్యసాయి సేవాసంస్థల జిల్లా అధ్యక్షుడు డి.సుధాకర్‌రావు, కడవెండి వేణుగోపాల్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు చంద్రశేఖరప్రసాద్‌, అనితారెడ్డి, ఉషశ్రీ, రుబీనాఫాతిమా, శాంతిసోని, మౌనిక, పూజిత, డీఎంహెచ్‌వో డా.మాలతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఆశాలకు నిత్యావసరాలు, మాస్కులు, ఫేసష్‌ీల్డులు అందచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని