మండల కేంద్రాల్లో ‘మెగా ప్రకృతి వనాలు’
logo
Published : 22/06/2021 06:11 IST

మండల కేంద్రాల్లో ‘మెగా ప్రకృతి వనాలు’

పదెకరాల చొప్పున సేకరణకు కలెక్టర్‌ ఆదేశాలు


తహసీీల్దార్లు, ఎంపీీడీఓలు, పీఆర్‌ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మండల కేంద్రాల్లో 10 ఎకరాల్లో విస్తీర్ణంలో ‘మెగా పల్లె ప్రకృతి వనాల’ రూపకల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ ఆదేశించారు. నూతన రేషన్‌ దుకాణాల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి పలు శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం మండల కేంద్రాల్లో 32 వేల మొక్కలతో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. స్థలాలను తహసీల్దార్లు, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు వెంటనే గుర్తించాలన్నారు. ఆయా నివేదికలను వెంటనే అందించాలని ఆదేశించారు. వనాల్లో ‘ఉపాధి పథకం’ ద్వారా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులపై సర్వే చేసి అర్హులను ఎంపిక చేయాలన్నారు. ఈ నెల 24వరకు జిల్లా పౌరసరఫరాల అధికారి లాగిన్‌కు అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఏ లోపాలు తలెత్తినా ఆర్‌.ఐ.లు, గిర్దావర్‌పై చర్యలు తప్పవన్నారు.

అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటే ప్రక్రియను ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎంపీఓ, ఎంపీడీఓ, మండల ప్రత్యేకాధికారులతో ఆయన మాట్లాడుతూ గుంతలు తవ్వే ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. రహదారుల పక్కన 10 అడుగుల ఎత్తైన మొక్కలు నాటేందుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, పీఆర్‌ ఈఈ సుధాకర్‌, అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని