మెరుగైన చిక్సిత అందిస్తాం: ఎస్పీ
logo
Published : 25/06/2021 04:01 IST

మెరుగైన చిక్సిత అందిస్తాం: ఎస్పీ

కొత్తగూడెం సాంస్కృతికం, న్యూస్‌టుడే: నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలు యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, సిద్ధబోయిన సారక్క ఆలియాస్‌ భారతక్క కొవిడ్‌ వైరస్‌తో మరణించినట్లు మావోయిస్టు పార్టీ గురువారం విడుదల చేసిన ప్రకటనపై జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ స్పందించారు. కేంద్ర కమిటీ నాయకులు, సభ్యులు ఎవరికీ కరోనా సోకలేదని గతంలో అవాస్తవ ప్రకటనలు చేసినట్లు చెప్పారు. సరైన వైద్యం లభించక పలువురు ప్రాణాలు కోల్పోవడానికి పార్టీ నాయకులు కారణమవుతున్నారని, దిగువ స్థాయి శ్రేణులు, సభ్యుల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదన్నారు. వైద్యానికి బయటకు వద్దామనుకునే వారిని అడ్డుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా కొవిడ్‌ సమస్యలను ఎదుర్కొనే వారు పోలీసులకు లొంగిపోయి మెరుగైన చిక్సిత పొందాలని ఓ ప్రకటనలో కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని