పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
eenadu telugu news
Updated : 29/07/2021 06:13 IST

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి


మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌

బూర్గంపాడు, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ అనుదీప్‌ పేర్కొన్నారు. సారపాకలోని ఐటీసీ ఎంఎస్‌కే ఆధ్వర్యంలో సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో సమీప అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జీవ వైవిధ్య ప్లాంట్‌ను బుధవారం మొక్కను నాటి ప్రారంభించారు. ఎకరం స్థలంలో 2,100 మొక్కలు నాటడంతోపాటు 40 వేల విత్తన బంతులు తయారు చేశామని ఐటీసీ అధికారులు వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఐటీసీ కర్మాగారం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మొక్కల పెంపకంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. విత్తన బంతులు తయారు చేసిన విధానాన్ని తెలుసుకున్నారు. జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం, ఐటీసీ ఉన్నతాధికారులు సిద్ధార్థమహంతి, శ్యామ్‌కిరణ్‌, చెంగల్‌రావు, అమిత్‌సింగ్‌, ఎంఎస్‌కే ప్రోగ్రాం మేనేజర్‌ సాయికిరణ్‌, వాష్‌ఐ పీవో గణేశ్‌, తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఆర్‌ఐ అక్బర్‌ బాబు, అటవీ అధికారులు వెంకటేశ్వరరావు, భీంచందర్‌, అలివేలు, నరేందర్‌ పాల్గొన్నారు.

పనులు వేగవంతం చేయాలి

మండలంలో బృహత్‌ పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. నిబంధనల ప్రకారం మొక్కలు నాటాలని సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని