కాల్వలో మునిగి వ్యక్తి మృతి
eenadu telugu news
Published : 25/09/2021 02:57 IST

కాల్వలో మునిగి వ్యక్తి మృతి


వెంకన్న

ఖమ్మం అర్బన్‌, న్యూస్‌టుడే: కాల్వలో ఈతకు దిగిన వ్యక్తి నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన ఖానాపురంహవేలి పోలీసు స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కుమారస్వామి కథనం ప్రకారం... దానవాయిగూడెంలో నివసించే దారా వెంకన్న(53) నేలకొండపల్లిలోని తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఈతకు వెళ్లే అలవాటు ఉన్న ఆయన శుక్రవారం ఉదయం సాగర్‌ ప్రధాన కాల్వలోకి దిగారు. నీటి ఉద్ధృతితో మునిగిపోయాడు. టేకులపల్లి వంతెన సమీపంలో వెంకన్న మృతదేహాన్ని అన్నం సేవా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ అన్నం శ్రీనివాసరావు బృందం బయటకు తీసింది. వెంకన్నకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రామ్‌భరత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని