బెజవాడలో నరహంతక ముఠా అరెస్టు
logo
Updated : 20/06/2021 13:40 IST

బెజవాడలో నరహంతక ముఠా అరెస్టు

విజయవాడ: వృద్ధులు, ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసి దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితులు పోలీసులకు చిక్కడంతో సంచలనం కలిగించిన వృద్ధ దంపతుల కేసులో చిక్కుముడి వీడింది. పోలీసుల కథనం ప్రకారం... విజయవాడ పెనమలూరులో ఏటీఎంలో చోరీ చేసి పట్టుబడిన ముగ్గురు నిందితుల వేలి ముద్రల ఆధారంగా కంచికచర్లలో వృద్ధ దంపతులను ఈ ముఠా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. డిసెంబరు 25న బండారుపల్లి నాగేశ్వరరావు అలియాస్‌ నాగులు, భార్య ప్రమీలారాణి దారుణహత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసేందుకు వచ్చి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇంటి వెనుక ఉన్న మెస్‌ డోర్‌ తెరిచి దొంగలు లోపలికి ప్రవేశించారని పోలీసులు గుర్తించారు.

వృద్ధ దంపతుల హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే... పెనమలూరులో ఒక ఏటీఎం చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వేలిముద్రల ఆధారంగా కంచికచర్లలో జంటహత్యలకు పాల్పడింది ఈ ముఠాయేనని పోలీసులు తేల్చారు. దొంగతనాలతో పాటు పలు హత్యల్లో వీరి ప్రమేయం ఉన్నట్టు సమాచారం. యూట్యూబ్‌లో నేర కథనాలు చూసి యువకులు పథకాలు రచిస్తున్నారని పోలీసులు విచారణలో తేలింది. ఒంటరి మహిళలు, ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులను టార్గెట్‌ చేసి సహజ మరణం పొందినట్టు ఎవరికీ అనుమానం రాకుండా హత్యలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ముఠా పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్టు పెనమలూరు పోలీసులు గుర్తించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని