Ap News: విషాదాంతమైన చిన్నారుల అదృశ్యం
logo
Published : 23/06/2021 01:23 IST

Ap News: విషాదాంతమైన చిన్నారుల అదృశ్యం

అగిరిపల్లి: కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలంలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం విషాదాంతమైంది. మండలంలోని ఈదర సగరపేటలో చెరువులో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆడుకునేందుకు నిన్న చెరువు వద్దకు వెళ్లిన జగదీశ్‌ (8), చంద్రిక (9), శశిత (11) కనిపించకుండా పోయారు. ఎంత వెతికినా చిన్నారులు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఈదరకు సమీపంలోని శోభనాపురం చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఇవాళ పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని