ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద: పేర్ని నాని
eenadu telugu news
Published : 01/08/2021 17:30 IST

ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద: పేర్ని నాని

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం, పులిచింతల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వస్తుంది. ఇవాళ సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు సుమారు లక్ష క్యూసెక్కులు, రేపటి వరకు సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందును కృష్ణా నది తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన ఎవరూ నదిలో దిగవద్దని మంత్రి వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని