నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకోవాలి
eenadu telugu news
Published : 26/09/2021 20:43 IST

నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకోవాలి

ఘంటసాల: రైతులు నాణ్యమైన విత్తనాన్ని స్వయంగా తామే తయారు చేసుకొని ఉత్పత్తి చేసుకోవాలని విజయవాడకు చెందిన నాబార్డు ఏజీఎం విజయ్‌ తెలిపారు. ఆదివారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌కు చెందిన అపెడా సంయుక్త ఆధ్వర్యంలో దివిసీమ రైతులకు వాణిజ్య ఉత్సవ్‌లో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గోదాముల నిర్మాణానికి రైతులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రాయితీపై రుణాలు మంజూరు చేస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అపెడా క్షేత్ర అధికారి డి.ధర్మారావు, కేవీకే ప్రధాన శాస్ర్తవేత్త ఝాన్సీ, సీనియర్‌ శాస్ర్తవేత్తలు సుధా జాకబ్, మంజువాణి, శ్రీలత, రైతులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని