పీఠాధిపతులకు కలంకారీ శాలువాలు
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

పీఠాధిపతులకు కలంకారీ శాలువాలు

శంఖుచక్రాలు, తిరునామం ముద్రించిన శాలువా

పెడనగ్రామీణం, న్యూస్‌టుడే: తితిదే గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈనెల 30, 31 తేదీల్లో తిరుపతిలో ప్రకృతి రైతుల సదస్సు, గోమహాసమ్మేళనం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా పలువురు జగద్గురువులు, పీఠాధిపతులు, స్వామీజీలు ప్రత్యేకంగా ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. వీరికి సహజసిద్ధ వస్త్ర శాలువాలను అందజేయాలని కార్యక్రమ నిర్వాహకులు భావించారు. ఈ శాలువాలను సహజసిద్ధ రంగులు వినియోగించి చేతి ముద్రణ ద్వారా పెడనలో తయారు చేయించారు. పెడనకు చెందిన పిచ్చుక శ్రీనివాస్‌ ప్రత్యేకంగా వీటిని కలంకారీలో తయారు చేశారు. శంఖుచక్రాలు, వేంకటేశ్వర స్వామి పాదాలు, విష్ణునామాలను వస్త్రాలపై ముద్రించారు. చిత్రకారుడైన విజయరామ్‌ సూచనలతో ఈ డిజైన్లు సిద్ధం చేశారు. ముద్రణకు అవసరమైన బ్లాకుల్ని రాష్ట్రపతి, శిల్పగురు అవార్డుల గ్రహీత పెడనకు చెందిన కొండ్రు గంగాధర్‌ ప్రత్యేకంగా చెక్కారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని