స్పందనతో సామాన్యులకు న్యాయం: ఎస్పీ
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

స్పందనతో సామాన్యులకు న్యాయం: ఎస్పీ

ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు సమస్యలను వివరిస్తున్న మహిళలు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: స్పందన కార్యక్రమం ద్వారా సామాన్యులకు సత్వర న్యాయాన్ని చేరువ చేస్తున్నట్టు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ చెప్పారు. రోజూ స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యలతో స్పందనకు వచ్చే బాధితుల నుంచి అర్జీలను సక్రమంగా స్వీకరించి వారితో మనస్ఫూర్తిగా మాట్లాడితే వారి సమస్య సగం పరిష్కారమైనట్టే భావిస్తారని, ఆ దిశగా అధికారులు ప్రవర్తించాలని సూచించారు. గుడివాడకు చెందిన వివాహిత అత్తింటి వారు వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారని, కోడూరుకు చెందిన మహిళ ప్రభుత్వం తనకు ఇచ్చిన స్థలాన్ని సరిహద్దుదారులు ఆక్రమించుకుని తనను బెదిరిస్తున్నారని తగు న్యాయం చేయాలని కోరారు. వివిధ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ వచ్చిన 52 ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ విచారించి తగు పరిష్కారం చూపాలని సంబంధిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని