టీకాపై అపోహలు వీడండి: డీఎంహెచ్‌వో
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

టీకాపై అపోహలు వీడండి: డీఎంహెచ్‌వో

కోరుకొల్లు: ఓ మహిళకు టీకా వేయిస్తున్న

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి సుహాసిని

గురజ (ముదినేపల్లి), న్యూస్‌టుడే: 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్‌ టీకా వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారిణి ఎం.సుహాసిని సూచించారు. గురజ పీహెచ్‌సీని సోమవారం ఆమె తనిఖీ చేసి, ఆసుపత్రి నిర్వహణపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం ఎస్టీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని, టీకా వేయించుకుంటే ప్రాణాపాయం ఉండదని చెప్పారు. వైద్యురాలు శిరీష, సీసీ శ్రీనివాసరావు, సీహెచ్‌వో ముత్తయ్య, ఏఎన్‌ఎం సింపోనియా, ఆశాలు పాల్గొన్నారు.

కోరుకొల్లు (కలిదిండి): టీకాతోనే కొవిడ్‌ బారి నుంచి ప్రాణాలను కాపాడుకోవడం సాధ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి మాచర్ల సుహాసిని స్పష్టం చేశారు. కోరుకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సోమవారం పరిశీలించారు. అనంతరం స్థానిక వైద్యాధికారి బాలకుమార్‌, సిబ్బందితో కలిసి కోరుకొల్లు -1, పడమటిపాలెం -1 ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. టీకా వేయించుకోని వాళ్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి అవగాహన కల్పించారు. సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

బంటుమిల్లి: టీకాతో కరోనా బారిన పడకుండా ఉంటారని జిల్లా వైద్యాధికారిణి ఎం.సుహాసిని తెలిపారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆమె వ్యాక్సినేషన్‌ తీరును పరిశీలించారు. నాగేశ్వరరావుపేటలో టీకా వేయించుకోని వారి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించారు. అనంతరం బంటుమిల్లి పీహెచ్‌సీని పరిశీలించారు. వైద్యులు సాయి, స్వరూప, హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ...

కలిదిండి: కలిదిండి, కోరుకొల్లు, మూలలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేయించేలా గట్టి చర్యలు చేపట్టాలని ఎంపీడీవో కె.పార్థసారథి పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి సూచించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో వ్యాక్సినేషన్‌పై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని