వృద్ధులకు రక్షణగా పలు చట్టాలు
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

వృద్ధులకు రక్షణగా పలు చట్టాలు

వృద్ధులకు భోజనం వడ్డిస్తున్న న్యాయ

సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్‌

మచిలీపట్నం కార్పొరేషన్‌,న్యూస్‌టుడే: వృద్ధులకు రక్షణగా అనేక చట్టాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్‌ అన్నారు. సోమవారం ఆయన నగరంలోని ఈడేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులతో మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా సంస్థ దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వ పరంగా సేవలు అందకపోయినా ఆశ్రమానికి వచ్చే పారాలీగల్‌ వాలంటీరుకు తెలియజేయాలన్నారు. వివిధ అంశాలపై ఆయన అవగాహన కల్పించారు.అనంతరం వృద్ధులకు భోజనం వడ్డించి వారికి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని