గనుల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

గనుల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

పెడన పోలీసుస్టేషన్‌లో సీజ్‌ చేసిన వాహనాలు

పెడన, న్యూస్‌టుడే: మండలంలోని వివిధ గ్రామాల్లో గనుల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‘ఇసుక అక్రమ రవాణా’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం, విజయవాడ నుంచి వచ్చిన సహాయ జియాలజిస్ట్‌ (ఏజీ) రాజశేఖర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఖ్యాతి తనిఖీలు నిర్వహించి పుల్లపాడు వద్ద ఒక ఇసుక టిప్పర్‌ను సీజ్‌ చేసి స్థానిక పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. నందమూరు-పెడన రహదారిపై రెండు ఇసుక ట్రాక్టర్లను గుర్తించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈదాడుల్లో స్థానిక తహసీల్దార్‌ పి.మధుసూదనరావు, వీఆర్వో మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏజీ మాట్లాడుతూ ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించి దాడులు నిర్వహించామని చెప్పారు. పుల్లపాడు చెరువులో తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని, అక్కడి నుంచి మట్టి తరలింపునకు తమ శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదని చెప్పారు. సీజ్‌ చేసిన వాహనాలను పోలీసు కస్టడీలో ఉంచామని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని