బాధ్యతగా విధులు నిర్వహించాలి
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

బాధ్యతగా విధులు నిర్వహించాలి

మాట్లాడుతున్న సమగ్రశిక్ష ఏపీసీ శేఖర్‌

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ప్రతి ఉద్యోగి తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని సమగ్రశిక్ష ఏపీసీ శేఖర్‌ అన్నారు. సోమవారం నగరంలోని హైనీస్కూల్లో బందరు డివిజన్‌ పరిధిలోని సమగ్రశిక్షణ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, బడిబయట విద్యార్థుల సర్వే, డ్రాపవుట్‌ పిల్లలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, ఉపాధ్యాయులకు ఇస్తున్న తర్ఫీదు తదితర అంశాలపై సమీక్షించారు. ఆయా పథకాల అమలుపై పలు సూచనలు చేశారు. ఐఈడీ జిల్లా సమన్వయకర్త ఎస్‌.రాంబాబు, సీఎంవో ఎల్‌.వెంకటేశ్వరరావు, ఎంఐఎస్‌ సమన్వయకర్త పి.వరప్రసాద్‌, అసిస్టెంట్‌ ఏఎంవో ఎండీ భాజానీ, ఏఎల్‌ఎస్‌ సమన్వయకర్త కె.సుధాకర్‌, ఎంఈవో దుర్గాప్రసాదు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా ఏపీసీ శేఖర్‌ను ఉద్యోగులు సత్కరించారు.

సమయపాలన పాటించకుంటే చర్యలు

కోమర్రు (ముదినేపల్లి), న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు సమయపాలన తప్పక పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని ఎంఈవో కె.నరేశ్‌కుమార్‌ హెచ్చరించారు. మండలంలోని కోమర్రు ప్రాథమిక పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిర్ణీత సమయం దాటాక పాఠశాలకు హాజరైనా, ముందుగా వెళ్లినా వారిపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో అవగాహన శక్తి ఏమేరకు ఉందో పరిశీలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని