close

సోమవారం, ఫిబ్రవరి 17, 2020

తాజా వార్తలు

ఓవరాల్‌ ఛాంపియన్‌ కృష్ణా జోన్‌

 మహిళలు, పురుషుల విభాగంలోనూ విజయం

వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంటర్‌ జోనల్‌ టీచింగ్‌ స్పోర్ట్స్‌, కల్చరల్‌ గేమ్స్‌

మహానందిలో ఆనందోత్సాహాల మధ్య ముగిసిన క్రీడా పోటీలు


ఓవరాల్‌ ఛాంపియన్‌ కప్‌తో కృష్ణా జోన్‌ మహిళా క్రీడాకారిణుల ఆనందం

మహానందిఫారం, (మహానంది), న్యూస్‌టుడే: మహానంది మండలం మహానందిఫారంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాల కేంద్రంగా ఈనెల 22 నుంచి 24 వరకు మూడురోజులపాటు నిర్వహించిన ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఇంటర్‌ జోనల్‌ టీచింగ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ గేమ్స్‌లో మహిళలు, పురుషుల విభాగంలో ఓవరాల్‌ ఛాంపియన్‌ కృష్ణాజోన్‌ జయకేతనాన్ని ఎగురవేసింది. శుక్రవారం ఈ పోటీలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. నిత్యం బోధనలు, పరీక్షలు, ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న శాస్త్రవేత్తలు, బోధనా సిబ్బంది క్రీడాపోటీలతో ప్రతిభ చాటారు. విజేతల వివరాలను కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ రవికాంత్‌రెడ్డి, ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మిలు వెల్లడించారు.

వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్‌ పోటీల్లోనూ తమ ప్రాధాన్యతలను నిలుపుకున్నారు. తెలుగు వక్తృత్వంలో డాక్టర్‌ సంధ్యారాణి సౌత్‌ సదరన్‌జోన్‌, డాక్టర్‌ బి.గోవిందరావు కృష్ణా జోన్‌, డాక్టర్‌ ఉమామహేశ్వరరావులు వరస స్థానాల్లో నిలిచారు. ఆంగ్లం పోటీల్లో డాక్టర్‌ బి.రూపేష్‌కుమార్‌రెడ్డి సౌత్‌ సదరన్‌ జోన్‌, డాక్టర్‌ ఎం.సురేష్‌, ఎన్‌సీహెచ్‌ఏటీజోన్‌, డాక్టర్‌ బి.గోవిందరావు కృష్ణాజోన్‌లు వరుస స్థానాల్లో విజేతలుగా నిలిచారు. ఆంగ్లం వ్యాసరచన పోటీలో డాక్టర్‌ బి.రూపేష్‌కుమార్‌రెడ్డి సౌత్‌ సదరన్‌జోన్‌, డాక్టర్‌ ఏడీవీఎస్‌ఎల్‌పీ ఆనంద్‌ కుమార్‌ గోదావరి జోన్‌, డాక్టర్‌ ఏ.త్రివిక్రమరావు ఎస్‌ఆర్‌జోన్‌లు వరుస విజేతలుగా నిలిచారు. వ్యాసరచన తెలుగు పోటీల్లో డాక్టర్‌ బి.గోవిందరావు కృష్ణాజోన్‌, డాక్టర్‌ సంధ్యారాణి సౌత్‌ సదరన్‌ జోన్‌, డాక్టర్‌ తేజేశ్వరి ఎన్‌సీహెచ్‌ఏటీ జోన్‌ల వారు విజేతలయ్యారు. మోనోయాక్టింగ్‌లో డాక్టర్‌ ఎం.ఎస్‌.వి.చలం సౌత్‌సదరన్‌జోన్‌ డాక్టర్‌ బి.గోవిందరావు కృష్ణాజోన్‌, డాక్టర్‌ పి.వెంకట్రావు ఎన్‌సీహెచ్‌ఏటీ జోన్‌ల వారు విజేతలుగా నిలిచారు. సోలోసాంగ్‌ పోటీల్లో డాక్టర్‌ చిన్నమనాయుడు ఎన్‌సీహెచ్‌ఏటీ జోన్‌, డాక్టర్‌ అంకయ్యకుమార్‌ సౌత్‌ సదరన్‌ జోన్‌ డాక్టర్‌ పి.మునిరత్నం ఎస్‌ఆర్‌ జోన్‌లు వరుస విజేతలయ్యారు. సోలో డాన్స్‌ పోటీల్లో డాక్టర్‌ వి.సైదానాయక్‌ కృష్ణాజోన్‌, డాక్టర్‌ వెంకట్రావు ఎన్‌సీహెచ్‌ఏటీజోన్‌, డాక్టర్‌ కిశోర్‌ ఎస్‌ఆర్‌ జోన్‌లు గెలుపొందారు. బృంద నృత్యాల్లో మొదటి స్థానంలో కృష్ణాజోన్‌, ద్వితీయ స్థానంలో ఎన్‌సీహెచ్‌ఏటీ, తృతీయ స్థానంలో సౌత్‌ సదరన్‌ బృందాలు జయకేతనం ఎగురవేశారు. గ్రూప్‌సాంగ్స్‌ పోటీల్లో సౌత్‌ సదరన్‌, ఎన్‌సీహెచ్‌ఏటీ, ఎస్‌ఆర్‌ జోన్‌లు వరుస విజయ స్థానాల్లో నిలిచారు. వన్‌యాక్ట్‌ప్లే పోటీల్లో ప్రథమ స్థానంలో సౌత్‌ సదరన్‌జోన్‌, ద్వితీయ స్థానంలో కృష్ణా జోన్‌, తృతీయ స్థానంలో ఎన్‌సీహెచ్‌ఏటీ బృందాలు విజేతలుగా నిలిచారు. విజేతలకు ప్రముఖులు జ్ఞాపికలను అందజేసి అభినందించారు.

సీఎంతో చర్చించి పరిష్కరిస్తాం 

- విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు చెన్నపురెడ్డిగారి రామ్మోహన్‌రెడ్డి

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డ్డితో చర్చించి పరిష్కరించేందుకు కృషిచేస్తామని విశ్వవిద్యాలయం బోర్డు పాలకమండలి సభ్యులు, పారిశ్రామిక వేత్త చెన్నపురెడ్డిగారి రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గతంలో ఆంగ్రూ టాప్‌ 3లో ఉండేదని ప్రస్తుతం 31వ స్థానంలోకి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. టాప్‌ 6కు చేర్చడానికి ప్రతి అధ్యాపకుడు, బోధనా సిబ్బంది అవిరళ కృషి చేయాలని కోరారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు, ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ చెంగారెడ్డి డీఎస్‌ఏ డాక్టర్‌ కోటేశ్వరరావు, డాక్టర్‌ ఏ.ప్రతాప్‌కుమార్‌రెడ్డి, బోర్డు సభ్యులు డాక్టర్‌ జాగర్లమూడి లక్ష్మీ, డాక్టర్‌ వి.శ్రీనివాసరావు, ఏడీఆర్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌, పీిడీ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్‌ ఎ.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ సతీష్‌రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.