close

శనివారం, ఫిబ్రవరి 29, 2020

తాజా వార్తలు

దామోదరం సంజీవయ్యకు ఘన నివాళులు

ఆదోని మార్కెట్‌: దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆర్డీవో బాలగణేశయ్య నివాళులర్పించారు. స్థానిక కార్వాన్‌పేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి పైకివచ్చారన్నారు. రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు.

వైకాపా కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ, ఆదోని బీసీ సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి గోపాల్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు దేవా, కాంగ్రెస్‌ పార్టీ మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ దేవిశెట్టి ప్రకాశ్‌, బీసీ సంఘం నాయకులు నల్లన్న, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.