
కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలి: సీఐటీయూ
ఆదోని మార్కెట్: లాక్డౌన్తో నష్టపోయిన కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదోని మండలం పాండవగల్లు గ్రామ సచివాలయం ముందు సీఐటీయూ నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ... లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి కార్మికుడికి రూ.10వేల ఆర్థిక సాయం అందించాలన్నారు. కార్మిక చట్టాల సవరణ అంశాన్ని ఉపసంహరించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్ర ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కేంద్రాలకు నాణ్యమైన సరకులను సరఫరా చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ స్థానాలను భర్తీ చేయాలన్నారు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తిక్కప్ప, పాండురంగ, జయమ్మ, మంగమ్మ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
Tags :