మరిన్ని వసతులు అవసరం
logo
Published : 05/07/2020 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరిన్ని వసతులు అవసరం

కర్నూలు సచివాలయం: జిల్లాలో ప్రతిరోజూ 3,500కుపైగా కరోనా పరీక్షలు చేస్తుండటంతో పాజిటివ్‌ కేసులు వంద వరకు నమోదవుతున్నాయని, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు అత్యంత చురుగ్గా పనిచేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల సన్నద్ధతపై వైద్య బృందాలతో సమావేశం నిర్వహించారు. వచ్చే వారానికి రోజుకు 5 వేల టెస్టులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీజీహెచ్‌ కొవిడ్‌ ఆసుపత్రిలోని 358 మంది రోగుల పూర్తి వివరాలు తీసుకుని కోమార్బిడ్‌ లేని 40 ఏళ్లలోపు ఉన్న.. మైల్డ్‌ లక్షణాలున్న పేషెంట్లను కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని