43 మంది ధ్రువపత్రాల పరిశీలన
logo
Published : 05/07/2020 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

43 మంది ధ్రువపత్రాల పరిశీలన

అభ్యర్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: స్పెషల్‌ డీఎస్సీ-2019కి ఎంపికైన తాత్కాలిక అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శనివారం జరిగింది. కర్నూలు ఎ.క్యాంపులోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో 45 పోస్టులకు సంబంధించి వారిని ఆహ్వానించగా 43 మంది హాజరై ధ్రువపత్రాల పరిశీలన చేయించుకున్నారు. కోర్టు కేసుల కారణంగా మిగిలిన రెండు పోస్టులను పెండింగులో పెట్టారు. పరిశీలనకు తక్కువ సమయం ఉండటంతో దూరప్రాంతాలవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా ఉదయం మొదలు కావాల్సిన వెరిఫికేషన్‌ మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో విద్యాధికారులు ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు. పత్రాల పరిశీలన అనంతరం విద్యాశాఖ సూపరింటెండెంటు రాజశేఖర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఆన్‌లైన్‌లో వారి వివరాలు నమోదు చేశారు. అంతకుముందు శిబిరాన్ని డీఈవో ఎం.సాయిరాం సందర్శించి పలు సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ సిబ్బందికి సహకారం అందించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని