‘స్కీంల పేరిట..వైకాపా స్కామ్‌లు చేస్తోంది’
logo
Published : 05/07/2020 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘స్కీంల పేరిట..వైకాపా స్కామ్‌లు చేస్తోంది’

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఏడాది పాలనలో వైకాపా ప్రభుత్వం స్కీంల పేరిట స్కాములు చేస్తోందని రాష్ట్ర తెదేపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మిగూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన స్వగృహంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఎంపిక చేసిన నేతన్న నేస్తంలో అనర్హులకు, మగ్గం లేని వాళ్లను ఎంపిక చేసి అర్హులను వదిలేశారని విమర్శించారు. ఇందులో వైకాపా సానుభూతిపరులకు అధికంగా కేటాయించారని విమర్శించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రంగుల పేరిట రూ.1300 కోట్లు ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శించారు. గుడేకల్లు గ్రామంలో మగ్గాలు లేని ఇళ్లలో సైతం ఎంపిక చేశారన్నారు. మాజీ డైరెక్టర్‌ నీలకంఠప్ప ఆయన ఇంట్లో మగ్గం లేకున్నా...ఎంపిక చేసిన సొమ్ము స్వాహా చేశారని పేర్కొన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు తెదేపా పట్టణ అధ్యక్షుడు మాచాని శివశంకర్‌, శాబీర్‌, సుందర్‌రాజు, ముల్లా కల్లీముల్లా, శిల్పా భాస్కర్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని