నీట మునిగి ఇద్దరు బాలురు మృతి
logo
Published : 05/07/2020 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీట మునిగి ఇద్దరు బాలురు మృతి

మురుగు గుంతను పరిశీలిస్తున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. కర్నూలు వీకర్‌ సెక్షన్‌ కాలనీలోని ఓ మురుగు గుంతలో పడి ముర్తుజావలి అలియాస్‌ మున్నా (4) మృతిచెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. షేక్‌ హుస్సేన్‌, రేష్మా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో మున్నా మొదటి సంతానం. శుక్రవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుతూ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు రాత్రి వరకు గాలించినా జాడ తెలియలేదు. శనివారం మధ్యాహ్నం కాలనీ సమీపంలోని ఓ గృహ సముదాయ కాలనీకి చెందిన మురుగు గుంతలో శవమై కనిపించాడు. ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఘటనతో హుస్సేన్‌ దంపతులు తల్లడిల్లిపోయారు. ఓ వెంచర్‌ నిర్వాహకులు నిర్లక్ష్యంగా గుంత తీసి వదిలేయటంతోనే తమ కుమారుడు చనిపోయారని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి తల్లిదండ్రులను పరామర్శించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్పరి, న్యూస్‌టుడే: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు నీటి కుంటలో పడి ప్రాణాలు విడిచి ఆ తల్లికి తీరని కడుపుకోతను మిగిల్చాడు. ఈ హృదయ విదారక ఘటన ఆస్పరి మండలంలోని కారుమంచి గ్రామంలో జరిగింది. చిట్టెమ్మ, జ్యోతిమూర్తి దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కుమారుడు మధు (13) కు మతిస్థిమితం సరిగా లేకున్నా.. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. శనివారం ఆ బాలుడు పొలం దగ్గరకు వెళ్లి ఆటలాడుతూ అక్కడ ఉన్న నీటికుంటలో పడిపోయారు. మధుకు ఈత రాకపోవడంతో కుంటలో మునిగిపోయి ప్రాణాలు విడిచారు. పక్క పొలం వాళ్లు చూసి ఆ బాలుణ్ని బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

మున్నా (పాత చిత్రం)

మధు (పాత చిత్రం)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని