Published : 03/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

6న ఫొరెన్సిక్‌ సైన్స్‌ సహాయకుల పరీక్షలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు ఆధ్వర్యంలో ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన రాత పరీక్ష ఈనెల 6న జరుగనుంది. కర్నూలు సమీపంలో జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల, పుల్లయ్య ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్ష నిర్వహించేందుకు డీఐజీ వెంకట్రామిరెడ్డి ఏర్పాట్లు చేశారు. రాయలసీమ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన 1486 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈమేరకు డీఐజీ, ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప ఇతర అధికారులు బుధవారం పరీక్ష కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. పుల్లారెడ్డి కళాశాల కోఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి, పుల్లయ్య కళాశాల కరెస్పాండెంట్‌ మోహన్‌, ప్రిన్సిపల్‌ శ్రీనివాసులుతో చర్చించారు. డీఎస్పీలు వెంకటాద్రి, యుగంధర్‌బాబు, కెవీ మహేష్‌, రామాంజినాయక్‌ సీఐలు ఓబులేషు, శ్రీనాథ్‌రెడ్డి వెంట ఉన్నారు.

గంట ముందే పరీక్ష కేంద్రానికి రావాలి

అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రం చేరుకోవాలని డీఐజీ సూచించారు. పెన్నులు, సెల్‌ఫోన్‌ ఇతర ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువుల పరీక్ష కేంద్రంలోకి నిషేధమన్నారు. పెన్ను కూడా పరీక్ష కేంద్రంలోనే ఇస్తారన్నారు. అభ్యర్థులు మాస్కులు, శానిటైజర్‌ తెచ్చుకోవాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని