
కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకుంటున్న డీజీసీఏ అధికారులు
ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ఓర్వకల్లు విమానాశ్రయాన్ని బుధవారం డీజీసీఏ అధికారులు తనిఖీ చేశారు. డీజీసీఏ ఉప సంచాలకులు దురైరాజ్, సహాయ సంచాలకులు ప్రభుకు విమానాశ్రయ పనుల గురించి కలెక్టర్ వీరపాండియన్ వివరించారు. వాణిజ్య విమానాల ఆపరేషన్స్ ప్రారంభించేందుకు అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయన్నారు. అనంతరం రన్‌వే, ఏటీసీ టవర్, పీటీపీ బిల్డింగ్, యాంటి హైజాక్ రూమ్, ఐసొలేషన్, భద్రత తనిఖీ ప్రాంతం, స్కానింగ్ కేంద్రం, తాగునీరు, మరుగుదొడ్లు, వీఐపీ లాంజ్, విద్యుత్తు గది, సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, విమానాశ్రయ సంచాలకులు కైలాష్ మండల్, ఈఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.